దళిత మహిళా (Dalit Woman) ప్రిన్సిపల్ (Principal)పై అధికార పార్టీ ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడుతున్న సంఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు (Harassment) గురిచేస్తున్నాడని మీడియా ముందు మహిళా ప్రిన్సిపల్ కన్నీరు పెట్టుకున్న వీడియో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పొందూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) ప్రిన్సిపల్‌పై ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ (Koona Ravikumar) కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ స్వయంగా మీడియా ఎదుట కన్నీళ్లతో వివరిస్తూ ప్రజల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం.. “నేను ఎటువంటి తప్పు చేయకపోయినా, ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు అకారణంగా నన్ను బదిలీ చేశారు. రాజకీయ నాయకుల చేత మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నాను. ఈ విషయం మీద ఇప్పటికే మహిళా కమిషన్, మానవ హక్కుల సంఘం, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశాను. కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
“దీనిపై నేను న్యాయపోరాటం చేస్తాను. అన్యాయంగా బదిలీ చేసిన చోటుకు నేను వెళ్లను. ఈ ఫిర్యాదు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే ఇంకా కక్ష గట్టే అవకాశం ఉంది. నాకు లేదా నా కుటుంబానికి ఏదైనా జరిగితే ఆయనే పూర్తి బాధ్యత వహించాలి” అని ఆమె స్పష్టం చేశారు.
దళిత మహిళా ప్రిన్సిపల్‌పై @JaiTDP ఎమ్మెల్యే కక్ష సాధింపు
— Telugu Feed (@Telugufeedsite) August 14, 2025
ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని KGBV ప్రిన్సిపల్ కన్నీరు
కక్ష కట్టి, అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ తనను బదిలీ చేయించాడని మండిపాటు
నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే స్థానిక… pic.twitter.com/Z60zs3H9ju








