బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దివంగత అందాల తార శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనను మీడియాతో పంచుకున్నారు. ఆయన శ్రీదేవి చెప్పిన కొన్ని మాటలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
శ్రీదేవి ఏం చెప్పింది?
బోనీ కపూర్ మాట్లాడుతూ.. “శ్రీదేవి నాకు ‘బట్టతలతో ఉంటే పర్వాలేదు, కానీ నువ్వు స్లిమ్‌గా ఉండాలి’ అని చెప్పేది,” అని గుర్తు చేసుకున్నారు. ఇది ఆయనకు చాలా ప్రేరణగా మారిందట. ఇటీవల బోనీ కపూర్ తలపై హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. దీనిపై మాట్లాడుతూ ఈ మధురమైన సంఘటనను పంచుకున్నారు.