సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాళ్లు ఇటీవల ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచేలా బ్యాటర్లు ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి స్టేజీపై మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన ‘గుంటూరు కారం (Guntur Kaaram)’ సినిమా ఫేమస్ సాంగ్ (Famous Song) ‘కుర్చీ మడతపెట్టి’కి స్టెప్పులేసి (Danced) దుమ్ములేపారు..
ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ క్రియేట్ చేస్తోంది. ఆటగాళ్ల స్టెప్పులు, ఎనర్జీ, ఫుల్ జోష్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. క్రికెట్ మైదానంలో కనిపించే ఆటగాళ్లు ఇలా స్టేజీపైన మెరచిపోవడం కొంతమందికి ఆశ్చర్యంగా కూడా ఉంది.
ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “ఓ మై గాడ్.. SRH ప్లేయర్లు ఇంకో టాలెంట్ (Another Talent) చూపించారు” అని కొందరైతే, “ఈసారి IPLలోనే కాదు.. డ్యాన్స్ ఫ్లోర్‌పైనా SRH ప్రతిభ చూపిస్తోంది” అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.