కొత్త హీరోతో సినిమా: శ్రీలీల పారితోషికం డబుల్!

కొత్త హీరోతో సినిమా: శ్రీలీల పారితోషికం డబుల్!

ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా, శ్రీలీల (Sreeleela ఇప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘రాబిన్ హుడ్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త హీరో (New Hero) కిరీటి (Kireeti)తో కలిసి ‘జూనియర్’ (Junior) అనే సినిమా చేసింది. ఇటీవల విడుదలైన ‘వైరల్ వయ్యారి’ అనే పాట ఈ సినిమాలోనిదే కావడం, అది తెగ వైరల్ అవ్వడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే ఉన్న ఈ బ్యూటీ, కొత్త హీరోతో సినిమా చేయడానికి రెమ్యునరేషన్ (Remuneration) భారీగానే తీసుకుందనే వార్తలు సినీవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగు మూలాలు ఉన్నప్పటికీ, శ్రీలీల బెంగళూరు (Bengaluru) లోనే పెరిగింది. హీరోయిన్‌గా ఆమె తొలి సినిమా కన్నడలోనే చేసింది. చాలాకాలం తర్వాత ఇప్పుడు ‘జూనియర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) కుమారుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగులో కూడా జూలై 18న విడుదలవుతోంది. సినిమాకు కొంత హైప్ కూడా నడుస్తోంది.

సాధారణంగా స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు శ్రీలీల రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. అయితే ‘జూనియర్’ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ.4 కోట్ల పారితోషికం ఇచ్చారని టాక్. అంటే డబుల్ బొనాంజా! ఈ సినిమాలో శ్రీలీల మాత్రమే కాస్త గుర్తింపు ఉన్న ముఖం కాగా, కిరీటి కొత్తవాడు. జెనీలియా కూడా చాలాకాలం తర్వాత ఈ సినిమాతోనే దక్షిణాదిలోకి రీఎంట్రీ ఇస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

‘జూనియర్’ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా, రాజమౌళి చిత్రాలకు పనిచేసే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. రాధాకృష్ణ రెడ్డి దర్శకుడు. తెలుగులో ‘ఈగ’ వంటి సినిమాలు నిర్మించిన వారాహి నిర్మాణ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో, ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించినట్లు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలీల జాక్‌పాట్ కొట్టినట్లు కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment