ఎట్టకేలకు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల

ఎట్టకేలకు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల

హీరో హీరోయిన్లు ఎవరితోనైనా కలిపి కనిపిస్తే చాలు, వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ రావడం సర్వసాధారణం. ఇటీవల హీరోయిన్ శ్రీలీల (Sreeleela) విషయంలో కూడా ఇదే జరిగింది. శ్రీలీల బాలీవుడ్‌ (Bollywood)లో కార్తీక్ ఆర్యన్‌ (Kartik Aaryan)తో కలిసి నటిస్తున్నారు. కార్తీక్‌తో శ్రీలీల కొన్ని పార్టీలకు వెళ్లడం, కార్తీక్ తల్లి తనకు డాక్టర్ కోడలుగా రావాలని చెప్పడం, కార్తీక్ ఆర్యన్ కుటుంబ ఫంక్షన్లలో శ్రీలీల పాల్గొనడం వంటి పలు సంఘటనలతో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ డేటింగ్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని వార్తలు వెలువడ్డాయి.

కార్తీక్ ఆర్యన్ – శ్రీలీల ప్రేమ రూమర్స్ (Rumors) బాలీవుడ్‌లో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు వీటిని శ్రీలీల కానీ, కార్తీక్ ఆర్యన్ కానీ ఖండించలేదు. దీంతో అందరూ వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అని భావించారు. అయితే, ఇటీవల శ్రీలీల ‘జూనియర్’ (“Junior”) సినిమా ప్రమోషన్స్‌ (Movie Promotions)లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌కు పుల్‌స్టాప్ (Full Stop) పెట్టేశారు.

శ్రీలీల తన ప్రేమ, పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి స్పష్టతనిస్తూ, “నేను ప్రేమలో పడ్డాను అని అందరూ అంటున్నారు. అసలు నేను ఎలా ప్రేమలో పడతాను? ప్రతీసారి మా అమ్మ నాతోనే ఉంటుంది. నేను వెకేషన్‌కు వెళ్లినప్పుడు కూడా మా అమ్మ నా పక్కనే ఉంటుంది. అలాంటప్పుడు నేను ఎలా ప్రేమలో ఉంటాను? అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ప్రస్తుతం నా వయసు 23. కనీసం 30 ఏళ్లు వచ్చేవరకు పెళ్లి చేసుకోను” అని తెలిపారు. దీంతో శ్రీలీల ప్రస్తుతం ఎవరితో ప్రేమలో లేదని, అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment