శ్రీ‌లీల బాలీవుడ్ ఎంట్రీ.. సైఫ్ అలీఖాన్ కొడుకుతో జోడి?

శ్రీ‌లీల బాలీవుడ్ ఎంట్రీ.. సైఫ్ అలీఖాన్ కొడుకుతో జోడి?

అందం, అభినయంతో అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్‌డం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లో తన ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, శ్రీలీల ముంబైలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కార్యాలయంలో దర్శనమిచ్చింది.

ఆ సమయంలో ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరూ కలిసి జోడీగా ఒక సినిమాకు సిద్ధమవుతున్నారని బీటౌన్ సమాచారం. శ్రీలీల తన టాలీవుడ్ విజయాల తర్వాత బాలీవుడ్‌కి వెళ్లడం, ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసి నటించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment