సౌరభ్ గంగూలీ బయోపిక్.. షూటింగ్ ప్రారంభం

సౌరభ్ గంగూలీ బయోపిక్.. షూటింగ్ ప్రారంభం

టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) జీవితం త్వరలో సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ బయోపిక్‌ (Biopic) లో ప్రముఖ బాలీవుడ్ (Bollywood) నటుడు రాజ్కుమార్ రావు (Rajkummar Rao) ప్రధాన పాత్రలో నటించనున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో శరవేగంగా సాగుతోంది. చిత్ర‌యూనిట్ సమాచారం ప్రకారం, తొలి షెడ్యూల్ రెండు నెలల పాటు జరగనుంది. క్రికెట్‌లో రెండు దశాబ్దాల పాటు అత్యద్భుత ప్రదర్శన కనబరిచిన గంగూలీ (Ganguly), భారత క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు. ఈ బయోపిక్ ద్వారా అతని ప్రయాణం మరింత ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విక్రమాదిత్య మోత్వానే (Vikramaditya Motwane) దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను లవ్‌ రంజన్‌ (Luv Ranjan) నిర్మిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment