కేంద్ర బడ్జెట్ (Union Budget) సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అన్నీ తప్పుడు హామీలే ఇచార్చు. పైగా, రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో బాగా అలసిపోయారు. పూర్ లేడీ” అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగం వేరీ బోరింగ్..నో కామెంట్ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఒక లేఖ విడుదల చేసింది.
రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన లేఖలో “సోనియా గాంధీ వ్యాఖ్యలు రాష్ట్రపతి పదవికి గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి. రాష్ట్రపతి ముర్ము అలసిపోయారన్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం. ఆమె ఎప్పటికీ అలసిపోరు. మహిళలు, రైతులు, అట్టడుగు వర్గాల గురించి రాష్ట్రపతి ఎంతో స్పష్టంగా మాట్లాడారు. అయితే, హిందీ వంటి భారతీయ భాషలలోని యాస, ఉపన్యాసాలపై పరిచయం లేకపోవడం వల్లే కొందరు తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకున్నారనేది మేము విశ్వసిస్తున్నాం” అని పేర్కొంది. అంతేకాక “ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం, ఖండించదగిన విషయం” అని రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా స్పందించింది.