ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై-నాగపూర్ హైవే వద్ద సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో, సోనాలి సూద్ ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీకొట్టింది.
ప్రమాదంలో సోనాలి సూద్‌తో పాటు కుటుంబ సభ్యులకు గాయాలు అయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాల తీవ్రతపై ఇంకా అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది. ఈ ఘటనపై ఇప్పటివరకు సోనూ సూద్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
అభిమానుల ఆందోళన
సోనాలి సూద్ ప్రమాద వార్త వెలుగులోకి రాగానే సోనూ సూద్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు బాలీవుడ్ నటులు, సన్నిహితులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.