మద్యం కోసం తల్లినే కిరాతకంగా చంపిన కొడుకు

మద్యం కోసం తల్లినే కిరాతకంగా చంపిన కొడుకు

.

మద్యం కోసం కన్నతల్లిని అతి క్రూరంగా చంపిన ఘటన అనకాపల్లి జిల్లా నాతవరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాతవరం మండలం వైబీ పట్నం గ్రామానికి చెందిన చిటికిల రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తి తన తల్లి మంగను డబ్బుల కోసం హత్య చేశాడు.

రామ్మూర్తి నాయుడు మద్యానికి బానిసయ్యాడు. ఈ వ్యసనం కారణంగా తరచూ ఇంట్లో డబ్బుల కోసం గొడవ పడేవాడు. అతని వేధింపులు భరించలేక భార్య, తల్లిదండ్రులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు.

గురువారం మరిడమ్మ పండుగ సందర్భంగా రామ్మూర్తి నాయుడు తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి విపరీతంగా మద్యం తాగి ఇంటికొచ్చి డబ్బుల కోసం తండ్రి జోగునాయుడుతో గొడవపడ్డాడు. కుమారుడి పరిస్థితి గమనించిన తండ్రి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

ఆ తర్వాత రామ్మూర్తి నాయుడు నిద్రిస్తున్న తన తల్లి మంగను డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన రామ్మూర్తి నాయుడు ఆమెను మంచం పైనుంచి కిందకు తోసేసి, పక్కనే ఉన్న పూలకుండీతో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన మంగ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment