---Advertisement---

మైక్రోసాఫ్ట్‌, స‌త్య‌నాదెళ్లపై చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌న్నీ అబ‌ద్ధాలే..

మైక్రోసాఫ్ట్‌, స‌త్య‌నాదెళ్లపై చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌న్నీ అబ‌ద్ధాలే..
---Advertisement---

దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. త‌న స్పిరిట్‌, ఎలివేష‌న్స్‌తోనే మైక్రోసాఫ్ట్ హైద‌రాబాద్‌కు వ‌చ్చింద‌ని, త‌న వ‌ల్లే స‌త్య‌నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యార‌ని వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోర‌మ్ స‌ద‌స్సుకు ముందు సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు సోష‌ల్ మీడియాలో కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఎప్పుడు, ఎలా, ఎవ‌రి సార‌థ్యంలో వ‌చ్చింది.. స‌త్య నాదెళ్ల ఎప్పుడు మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అయ్యారో సంవ‌త్స‌రం, తేదీల‌తో స‌హా ఆధారాల‌ను స‌ర్క్యులేట్ చేస్తున్నారు.

హైద‌రాబాద్‌లో 1998లో మైక్రో సాఫ్ట్ టెంపరరీ సెటప్ పెడితే, ముఖ్య‌మంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టాక 2004లో పర్మినెంట్ క్యాంపస్ పెట్టించారు. దీని కోసం 42.25 ఎకరాల భూమిని వైఎస్ మాదాపూర్‌లో కేటాయించారు. ఈ క్యాంప‌స్‌ను నవంబర్ 15, 2004లో ఆయనే ప్రారంభించారు. అమెరికా వెలుపల అతిపెద్ద మైక్రో సాఫ్ట్ క్యాంపస్ వైఎస్ హయాంలోనే హైదరాబాద్‌కు వచ్చింది.

ఇంకో వాస్తవం ఏంటంటే.. 1992లో సత్య నాదెళ్ల మైక్రో సాఫ్ట్ లో చేరారు. అంటే చంద్రబాబు అప్ప‌టికి సీఎం కాలేదు. బాబు ముఖ్య‌మంత్రి కాక‌మునుపే స‌త్య‌నాదెళ్ల మైక్రో సాఫ్ట్ లో ఐటీ ఇంజనీర్. అలాంటిది తనవల్లే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో ఐటీ ఇంజనీర్‌గా ఎదిగాడని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సోష‌ల్ మీడియాలో ఆధారాల‌తో స‌హా స‌ర్య్కులేట్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment