టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) గురించి ఆసక్తికర విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ గర్భవతి (Pregnant)అని టాలీవుడ్ కాంపౌండ్ ఓ వార్త బయటకు రాగా, అదంతా నిజమనుకొని అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. కానీ, తనపై జరుగుతున్న ప్రచారానికి శోభిత చెక్ పెట్టారు.
శోభిత ప్రెగ్నెంట్ అని తనపై వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని (speculations), ఆమె వ్యక్తిగత జీవితాన్ని సంబంధించి ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని శోభిత టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం శోభిత ధూళిపాళ తన వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతున్నారని, మాతృత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె టీమ్ వెల్లడించింది. దీంతో ఈ ప్రచారాలకు తెరపడినట్టయ్యింది.