హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్

హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ నివేదికను నిలిపివేయాలని, దాని ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె కోరారు.

స్మితా సబర్వాల్ వాదన: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్, కమిషన్ తనకు కేవలం సాక్షిగా మాత్రమే సమన్లు జారీ చేసిందని, చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా మూడు బ్యారేజీల నిర్మాణ స్థలాలను ఆమె సందర్శించారని, వాటి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల్లో ఆమెకు పాత్ర ఉందని కమిషన్ నివేదికలో పేర్కొంది. సంబంధిత ఫైళ్లను కేబినెట్ ఆమోదం కోసం ఉంచనందుకు, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది.

స్మితా సబర్వాల్ అభ్యంతరం: కమిషన్ తనపై పక్షపాతం తో వ్యవహరించిందని, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిందని ఆమె ఆరోపించారు. ఈ నివేదికను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఒకటి లేదా రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment