ప్ర‌జ‌ల ప్రాణాల‌కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? – కేటీఆర్ ఫైర్‌

ప్ర‌జ‌ల ప్రాణాల‌కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? - కేటీఆర్ ఫైర్‌

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది గల్లంతైన విషాద పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ ఘటనపై సోమవారం ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా సీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఓట్ల వేటలో జిల్లాల చుట్టూ తిరిగే టైమ్ ఉంది కానీ, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద బాధితుల పరిస్థితిని చూడటానికి ఒక్కసారి వెళ్ళే సమయం లేదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజా పాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేట మాత్రమేనా? అని నిలదీశారు. కేటీఆర్ ప్రభుత్వ తీరును ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు. చిక్కుకుపోయిన‌ ఎనిమిది మందిని రక్షించేందుకు సర్కారు పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. సహాయక చర్యలు ఇంకా కొలిక్కి రాకముందే బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫైర‌య్యారు. రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు, ప్రజల ప్రాణాలకు త్రీవ ముప్పు ఉన్నా సీఎం రాజకీయ వేడిలో మునిగిపోతున్నారు.

కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు గుణపాఠం చెప్తారు
SLBC ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. “గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ప్రచారం కోసం ప్రజల బాధలను పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజలు సరైన సమయంలో కర్రుగాల్చి వాత పెడతారు” అంటూ ఆయన మండిపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment