ప్రసిద్ధ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాం స్కైప్ (Skype) ఇక మరికొద్ది రోజుల్లో కనుమరుగుకానుంది. 2003లో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చేత గుర్తింపు పొందిన అప్లికేషన్ రోజుల వ్యవధిలోనే మాయం కానుంది. స్కైప్ తన సేవలకు ముగింపు పలకున్నట్లుగా దాని మాతృసంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) అధికారికంగా ప్రకటించింది. మే 5 నుంచి స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
మెరుగైన ప్రత్యామ్నాయాలే కారణం
మార్కెట్‌లో జూమ్ (Zoom), టిమ్స్ (Teams), గూగుల్ మీట్ (Google Meet) లాంటి ఆధునిక ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రావడంతో స్కైప్ ప్రాచుర్యం నెమ్మదిగా తగ్గింది. ఈ పోటీలో నిలబడలేకపోయిన స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు మే 5న మూసివేయనుంది.
పెయిడ్ సేవల సమాప్తి
స్కైప్ ద్వారా క్రెడిట్ (Skype Credit), కాలింగ్ ప్రణాళికలు (Calling Plans) వంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లను ఇప్పటికే మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. వినియోగదారులకు కొత్తగా ఎలాంటి చందాలు అందుబాటులో ఉండవని సూచించింది.