నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కేసు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
నెల్లూరులో వైద్యం, ఆపై చెన్నైకి తరలింపు
ఆరేళ్ల బాలుడు మొదట నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. కానీ, వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో చెన్నైకి తరలించారు. అక్కడి వైద్యులు బాలుడి రక్త నమూనాలను పుణేలోని ప్రత్యేక ల్యాబ్‌కు పంపారు. ఈ పరిస్థితుల్లో, ముందు జాగ్రత్త చర్యగా వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
తక్షణ చర్యలు అవసరం
ఈ కేసు దృష్ట్యా గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. స్థానిక వైద్య బృందాలు మరింత పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. తగిన సూచనలు చేస్తున్నాయి.