మిథున్ రెడ్డిపై మళ్లీ సిట్ సోదాలు.. కక్ష సాధింపేనా?

మిథున్ రెడ్డిపై మళ్లీ సిట్ సోదాలు.. కక్ష సాధింపేనా?

వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy) ఇళ్లు, ఆఫీస్‌ల‌లో సిట్(SIT) అధికారులు మ‌ళ్లీ సోదాలు చేప‌ట్టారు. హైద‌రాబాద్‌ (Hyderabad), తిరుప‌తి (Tirupati)లోని మిథున్‌రెడ్డి ఇళ్లు, కార్యాల‌యాల్లో రైడ్స్(Raids) మొదలుపెట్టింది. సిట్ అధికారుల చ‌ర్య‌పై వైసీపీ తీవ్రంగా మండిప‌డుతోంది. పెద్దిరెడ్డి కుటుంబంపై కూట‌మి ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని వైసీపీ శ్రేణులు, పెద్దిరెడ్డి అనుచ‌రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

హైదరాబాద్‌లో ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాలపై మరోసారి సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. మద్యం కేసు విచారణ పేరుతో సిట్ మిథున్ రెడ్డిని నివాసంలోనే ప్రశ్నించింది. ఇప్పటికే ఆయనను అనేకసార్లు విచారించిన సిట్, జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని ప్రశ్నించగా, ఇప్పుడు మరోసారి సోదాలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇటీవలే మిథున్ రెడ్డి కేంద్ర హోంమంత్రికి లేఖ రాసి, నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ లేఖ అనంతరం సిట్ మళ్లీ సోదాలు ప్రారంభించడం కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఇక మరోవైపు, అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై తీర్పు రానున్న వేళ సిట్ సోదాలు జరగడం అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైసీపీ ఎంపీని టార్గెట్ చేస్తోందన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment