టీమిండియా (Team India) ఫాస్ట్ బౌలర్ (Fast Bowler) మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇప్పుడు ఇంగ్లాండ్ (England) పర్యటన తర్వాత ఒక నెల బ్రేక్ (One Month Break) తీసుకుంటున్నారు. ఈ బ్రేక్‌ను ఉపయోగించుకుని ఆటగాళ్లంతా తమ కుటుంబం (Family)తో గడుపుతున్నారు. సిరాజ్ కూడా రాఖీ పండుగను (Rakhi Festival) జరుపుకున్నారు. అయితే, సిరాజ్‌కు రాఖీ కట్టిన అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల వచ్చిన పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. సిరాజ్, గాయని(Singer) ఆశా భోస్లే (Asha Bhosle) మనవరాలు (Granddaughter) జనై భోస్లే (Janai Bhosle) మధ్య లవ్ స్టోరీ (Love Story) నడుస్తోందంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే, రాఖీ పండుగ సందర్భంగా జనై భోస్లే సిరాజ్‌కు రాఖీ కట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత క్రికెటర్లు అందరూ ఇంటికి చేరుకున్నారు. దీంతో రాఖీ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా (Social Media)లో ఒక వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లే, సిరాజ్‌కు రాఖీ కట్టడం చూడవచ్చు.
గత కొంతకాలంగా జనై భోస్లే, మహ్మద్ సిరాజ్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సోషల్ మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. వారిద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో కూడా వైరల్ అయింది. జనై భోస్లే ఐపీఎల్ మ్యాచ్‌లలో సిరాజ్‌కు మద్దతుగా మైదానానికి రావడం కూడా ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అయితే, జనై భోస్లే తన సోషల్ మీడియాలో సిరాజ్‌కు రాఖీ కట్టిన వీడియోను పోస్ట్ చేసి, “అందరిలో ఇంతకంటే గొప్పది నేను కోరుకోలేదు” అని రాసింది. ఈ వీడియోతో పాటు గతంలో కూడా జనై సిరాజ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “నా ప్రియమైన అన్నయ్య” అని సంబోధించింది. అప్పుడు సిరాజ్ కూడా “నా చెల్లి లాంటి వారు ఎవరూ లేరు” అని సమాధానమిచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య ఉన్నది బ్రదర్ సిస్టర్ రిలేషన్ అని తేటతెల్లం అయింది.