సిరాజ్‌తో డేటింగ్.. మహీరా క్లారిటీ

సిరాజ్‌తో డేటింగ్.. మహీరా క్లారిటీ

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌(Mohammad Siraj)తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లను బాలీవుడ్ నటి మహీరా శర్మ(Mahira Sharma) తీవ్రంగా ఖండించారు. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని స్పష్టం చేశారు. “ఫ్యాన్స్ ఎవరితోనైనా సంబంధం కలిపేస్తారు, వాటిని ఆపలేము. కో-స్టార్లతో రిలేషన్ ఉందని అనుమానిస్తారు. ఎడిట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అలాంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు” అని మహీరా స్పష్టం చేశారు.

క్రికెట‌ర్ సిరాజ్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లుగా ఇటీవ‌ల అనేక వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవల మహీరా తల్లి సానియా శర్మ కూడా ఈ డేటింగ్ రూమర్లను కొట్టిపారేశారు. వాస్త‌వాలు తెలుసుకోకుండా అబ‌ద్ధాల‌ను ప్రచారం చేయడం తగదని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment