టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన ‘సింగిల్ (Single)’ సినిమా ట్రైలర్ (Movie Trailer) కొత్త వివాదానికి తెరలేపింది. ఈ ట్రైలర్‌లో హీరో శ్రీ విష్ణు (Sri Vishnu) చెప్పిన కొన్ని డైలాగులు మంచు కుటుంబం (Manchu Family)పై సెటైరిక్‌గా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా “శివయ్య (Shivayya)” అనే పిలుపుతో పాటు, “మంచు కురిసిపోయింది” అనే డైలాగ్‌ను ఉపయోగించిన తీరు, వివాదాస్పదంగా మారింది.
ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు తమ కుటుంబాన్ని ఎగతాళి చేయడమేనని మోహన్ బాబు (Mohan Babu), విష్ణు మంచు (Vishnu Manchu) అనుచరులు (Supporters) ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం విడుదల దశలో ఉన్న ‘కన్నప్ప’ సినిమాలోని డైలాగును వక్రీకరించి ట్రైలర్‌లో వాడినట్లుగా చెబుతున్నారు. మోహన్ బాబు ఇంటి పేరు “మంచు” కావడంతో మరో డైలాగ్‌లో “మంచు కురిసిపోయింది” అని వాడటాన్ని తప్పుబట్టారు. ఉద్దేశపూర్వకంగానే ట్రైలర్‌ను రూపొందించారని ఆరోపణలు వచ్చాయి. ‘కన్నప్ప’ టీం కూడా ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ‘సింగిల్’ టీంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చేస్తున్న సినిమాను వ్యంగ్యంగా ప్రదర్శించడాన్ని సహించబోమని వారంటున్నారు.
ఈ వివాదం క్రమంగా ముదిరిపోతుండడంతో, హీరో శ్రీ విష్ణు స్పందిస్తూ మంచు కుటుంబానికి క్షమాపణలు (Apologies) చెప్పారు. “ఈ ట్రైలర్‌లో ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, ఎవరినీ కించపరచడం తమ సింగల్ టీమ్ ఉద్దేశం కాదు” అని శ్రీ విష్ణు తెలిపారు. ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇష్యూ సినిమా ప్రమోషన్‌కి బూస్ట్ అయ్యిందా? లేక వివాదం పెరిగిందా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.