సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. దసరా బోనస్‌ ఎంతో తెలుసా..?

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. బోనస్‌ ప్రకటించిన సర్కార్..

భూగర్భ గనుల్లో బొగ్గు తవ్వకం చాలా ప్రమాదకరమైన పని. గనుల్లో ఉష్ణోగ్రతలు, తేమ ఎక్కువగా ఉండటంతోపాటు, కార్మికులకు శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, మరియు ఆస్తమా వంటి వృత్తిపరమైన వ్యాధులకు గురవుతారు. ఒక్కోసారి ప్రమాదాల కారణంగా ప్రాణాపాయం కూడా ఉంటుంది.

ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గత ఏడాది 33% ఉన్న లాభాల వాటాను ఈసారి 34%కి పెంచుతూ బోనస్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి రూ. 1,95,610 పంపిణీ చేయనున్నారు. మొత్తం రూ. 819 కోట్ల బోనస్‌ను పంపిణీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. సింగరేణి సంస్థను రాష్ట్రానికి ఆత్మగా ఆయన అభివర్ణించారు.

ఈ సందర్భంగా, సింగరేణి సంస్థ రూ. 6,394 కోట్ల లాభాలు ఆర్జించిందని, ఇందులో రూ. 4,034 కోట్లు భవిష్యత్తు పెట్టుబడుల కోసం కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు రూ. 2,360 కోట్లను లాభాల వాటాగా అందిస్తున్నామని వివరించారు. అలాగే, 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5,500 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సింగరేణి విస్తరణ కోసం రూ. 4,034 కోట్లు కేటాయించామని, కర్ణాటకలో గోల్డ్ మైన్ కూడా దక్కించుకున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment