ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) జీవితాన్ని (Life) ఆధారంగా చేసుకొని బయోపిక్ (Biopic) తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ బయోపిక్‌కు సంబంధించి సోషల్ మీడియాలో మరో కొత్త ప్రచారం ఊపందుకుంది. తాజా సమాచారం ప్రకారం.. బయోపిక్‌లో కోహ్లి పాత్రను కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో శింబు (Simbu) పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, శింబుకే ఈ పాత్ర దక్కే అవకాశముందని టాక్. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్తపై క్లారిటీ రావాల్సి ఉంది కానీ, శింబు కోహ్లిగా నటిస్తే అది అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ కానుందంటున్నారు సినీ వర్గాలు.