యూకేలో సిక్కు యువతిపై అత్యాచారం, జాత్యహంకార వ్యాఖ్యలు

యూకేలో సిక్కు యువతిపై అత్యాచారం, జాత్యహంకార వ్యాఖ్యలు

లండన్: యూకేలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం అనంతరం, ఆమెను బెదిరిస్తూ, “నీ దేశానికి తిరిగి వెళ్లిపో” అంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో టేమ్ రోడ్డు సమీపంలో జరిగింది.

బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిని జాతి వివక్షతో కూడిన లైంగిక దాడిగా పోలీసులు పరిగణిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులలో ఒకరు గుండు చేయించుకుని ముదురు రంగు స్వెట్‌షర్ట్ ధరించి ఉన్నాడని, మరొకరు బూడిద రంగు టాప్ ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన స్థానిక సిక్కు వర్గంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గస్తీని పెంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. బ్రిటీష్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. బ్రిటన్‌లో మహిళల పట్ల ద్వేషానికి తావు లేదని ఆమె స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment