టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో సినీ అభిమానులకు దగ్గరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘కోహినూర్’ చిత్రంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే, మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈసారి ప్రొడ్యూసర్ నాగవంశీతో చేతులు కలపబోతున్నారని సమాచారం. టాలీవుడ్‌లో సంచలనంగా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ తరహా చిత్రాన్ని సిద్ధుతో తీసే ఆలోచనలో ఉన్నారట నాగవంశీ.
సినీ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం ఈ కొత్త ప్రాజెక్ట్ కథపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కాంబినేషన్ టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.