కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) మరోసారి స్పష్టత ఇచ్చారు. 2023లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో (DK Shivakumar) రెండున్నరేళ్లకు సీఎం పదవీ భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నట్లు వినిపిస్తున్న వాదనలను ఆయన అసెంబ్లీలో ఖండించారు. “నేను ఐదేళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్లీ సీఎం అయ్యాను. హైకమాండ్ ముందు నా బాధ్యత ఉంది. రెండున్నరేళ్లకు కుర్చీ పంచుకోవాలన్న ఎలాంటి ఒప్పందం లేదు” అని సిద్దరామయ్య తెలిపారు.
ఇక రాజకీయ పరిణామాల నేపథ్యంలో, మంత్రి సతీశ్ జార్కిహోళి ఇంట్లో జరిగిన విందులో సిద్దరామయ్యతో పాటు ఆయన సన్నిహిత నేతలు హాజరయ్యారు. డీకే శివకుమార్ ఆ ఆహ్వానంలో లేకపోవడం రాజకీయ చర్చలకు దారితీసింది. కాగా, డీకే వర్గం 2026 ఏప్రిల్‌లోపు ముఖ్యమంత్రి మార్పు కోరుతూ, సిద్దరామయ్య వర్గం పూర్తి పదవీకాలం కొనసాగించాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిద్దరామయ్య తన పదవీకాలం పూర్తయ్యాక 2028 ఎన్నికల్లో శివకుమార్‌కు మద్దతు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి, ఇది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఓటు బ్యాంక్‌ను ఏకతాటిపైకి తీసుకువచ్చే వ్యూహంగా భావిస్తున్నారు.








