శుభ్‌మన్, సారా ప్రేమ పుకార్లకు మళ్ళీ రెక్కలు!

శుభ్‌మన్, సారా ప్రేమ పుకార్లకు మళ్ళీ రెక్కలు!

భారత (Indian) టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill), సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ (Sara Tendulkar)లు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం (Love Affair) గురించి పాత పుకార్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి.

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన ‘యువీక్యాన్ (YouWeCan) ఫౌండేషన్ (Foundation) కోసం జూలై 8, 2025న లండన్‌ (London)లో ఏర్పాటు చేసిన ఛారిటీ డిన్నర్‌ (Charity Dinner)లో ఈ సంఘటన జరిగింది. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి, చికిత్స కోసం నిధులు సేకరించడానికి ఈ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శుభ్‌మన్ గిల్ తన టెస్ట్ టీమ్‌తో కలిసి హాజరయ్యాడు. అక్కడే సారా టెండూల్కర్ కూడా ఉండటంతో, వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.

వైరల్ అవుతున్న ఫోటోలో శుభ్‌మన్ నవ్వుతూ కనిపించగా, సారా అతని ముందు కూర్చుని ఉంది. గిల్ తన జట్టుతో విందుకు వచ్చినప్పుడు, సారా అప్పటికే అక్కడ ఉందని తెలుస్తోంది. సారా టెండూల్కర్ స్వయంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది, అందులో ఆమె తన స్నేహితులతో కనిపించింది.

గతంలో కూడా శుభ్‌మన్ గిల్ పేరు సారా టెండూల్కర్‌తో పలుమార్లు వినిపించింది. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు వదంతులు వచ్చాయి. ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం, పోస్ట్‌లకు లైక్ చేయడం, కామెంట్ చేయడం వంటివి జరిగాయి. అయితే, ఆ తర్వాత ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ వదంతులకు తెరపడింది. అయినప్పటికీ, ఈ పుకార్లపై శుభ్‌మన్ గానీ, సారా గానీ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment