భారత క్రికెట్ (India Cricket)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని బీసీసీఐ (BCCI)సెలక్షన్ కమిటీ, భారత వన్డే జట్టు కెప్టెన్‌గా యువ సంచలనం శుభ్‌మాన్ గిల్ (Shubman Gill)ను నియమించింది. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనతో గిల్ తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన చేసి, రికార్డు స్థాయిలో 754 పరుగులు చేసిన గిల్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని, సెలెక్టర్లు అతడికి వన్డే పగ్గాలు అప్పగించారు. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ శకానికి తెరపడింది. గిల్ నాయకత్వంలో టీమిండియా ఎలాంటి ఫలితాలు సాధిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








