---Advertisement---

నేను మద్యానికి బానిసయ్యానంటే వాళ్లే కార‌ణం.. శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

నేను మద్యానికి బానిసయ్యానంటే వాళ్లే కార‌ణం.. శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు
---Advertisement---

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. “నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఈ పరిణామం నన్ను కృంగదీసింది. నేను తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యాను. ఆ స్థితిలో మద్యం పట్ల అలవాటు పెరిగింది” అని ఆమె తెలిపారు.

విడాకుల ప్రభావం
శృతి హాసన్ మాట్లాడుతూ.. “నా తల్లిదండ్రుల విడాకులు నా జీవితంపై ఎమోషనల్‌గా తీవ్ర ప్రభావం చూపాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. నా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది. కానీ ఆ కష్టాలను ఎదుర్కొంటూ, ఇప్పుడే మంచిగా జీవనం సాగిస్తున్నాను” అని వెల్లడించారు.

అంతేకాదు.. త‌న తండ్రి క‌మ‌ల్ హాస‌న్‌కు గుడికి వెళ్ల‌డం కూడా న‌చ్చేది కాద‌ని, దొంగ‌చాటుకు గుడికి వెళ్లివ‌చ్చేదాన్ని అని, త‌న తాత‌తో క‌లిసి చ‌ర్చికి కూడా వెళ్తుండేదాన్ని అని చెప్తూనే.. త‌న‌కు దేవుడి ప‌ట్ల అపార‌మైన భ‌క్తి, న‌మ్మ‌కం ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను, చిత్ర‌ పరిశ్రమను ఆశ్చర్యపరచాయి. తల్లిదండ్రుల విడాకులు బాలల జీవితాలపై ఎలా ప్రభావం చూపుతాయో, శృతి తన కథ ద్వారా చెప్పుకొచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment