కోలీవుడ్ యువ నటి(Kollywood Actress) శృతి నారాయణన్(Shruthi Narayanan) ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యాయంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. క్యాస్టింగ్ కౌచ్(Casting Couch)కు సంబంధించిన 14 నిమిషాల వీడియో లీక్ అయ్యిందంటూ కొందరు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో #ShruthiNarayananVideo హ్యాష్‌ట్యాగ్‌తో ఈ విషయాన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు.
డీప్ ఫేక్ వీడియోనా?
ఇప్పటి వరకు శృతి నారాయణన్ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. అయితే, ఇది డీప్ ఫేక్ (Deepfake) టెక్నాలజీతో సృష్టించిన వీడియో అయి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. కంటెంట్ ప్రైవసీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని అనర్థాలు జరుగుతాయని నిపుణులు (Experts) హెచ్చరిస్తున్నారు.
శృతి నారాయణన్ పలు యూట్యూబ్ (YouTube) షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. “సిరగదిక్క ఆసై” (Siragadikka Aasai) అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరకు చేరింది. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ (heroine) గా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.