ఇండియన్ స్టార్ ప్లే బ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. ”నా ఎక్స్ ఖాతా ఫిబ్రవరి 13 నుంచి హ్యాక్ అయింది. దీని గురించి ఎక్స్ టీమ్‌ను సంప్రదించేందుకు నేను చాలా ప్రయత్నించాను. అయితే, కొన్ని ఆటో-జనరేటెడ్ రెస్పాన్స్‌ల తప్ప, ఎలాంటి సహాయం అందలేదు. ఇప్పటికీ నా ఖాతా నా ఆధీనంలో లేదు” అని పేర్కొంది. అభిమానులను అప్రమత్తం చేస్తూ “నా ఖాతా నుంచి వచ్చే ఏ లింక్‌పై క్లిక్ చేయవద్దు, ఏ పోస్ట్‌నైనా నమ్మవద్దు” అని సూచించింది. తన ఖాతా తిరిగి వస్తే, వ్యక్తిగతంగా వీడియో ద్వారా అప్డేట్ ఇస్తానని స్పష్టం చేసింది.
శ్రేయా ఘోషల్ ‘ఎక్స్’ హ్యాక్.. ఫ్యాన్స్‌కు కీలక సూచన








