Shocking : పార్లమెంట్‌లో న్యూడ్ ఫొటో చూపించిన మహిళా ఎంపీ!

Shocking : పార్లమెంట్‌లో న్యూడ్ ఫొటో చూపించిన మహిళా ఎంపీ!

ఇటీవల డీప్ ఫేక్ (Deep Fake) టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అంతా ఈ మాయాజాలం నుంచి తప్పించుకోలేని పరిస్థితి. ఆధునిక ఏఐ సాంకేతికతతో నిజంలా కనిపించే న‌కిలీ ఫోటోలు, వీడియోలు తయారవుతున్నాయి. ఇవి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని నాశనం చేసే స్థాయికి వెళ్లిపోతున్నాయి.

పార్లమెంట్‌లో న్యూడ్ ఫొటో
ఈ విషయంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు న్యూజిలాండ్ (New Zealand) మహిళా ఎంపీ(MP) లారా మెక్ క్లూర్ (Laura McClure) ఒక విప్లవాత్మక చర్య చేపట్టారు. పార్లమెంట్ (Parliament) వేదికగా స్వయంగా తాను తయారు చేసిన నకిలీ న్యూడ్ (Fake Nude) ఫొటోను (Photo) బ్లర్ చేసి ప్రింట్ తీసి అందరికి చూపించారు. ఈ ఫొటోను డీప్‌ఫేక్ టెక్నాలజీతో తాను ఐదునిమిషాల లోపే సృష్టించానని వెల్లడించారు. ఈ ప్రదర్శన ద్వారా డీప్‌ఫేక్‌లను తయారుచేయడం ఎంత ఈజీగా మారిందో, దాని దుష్పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఎంపీ వివరించారు. ఓ 13 ఏళ్ల బాలిక డీప్‌ఫేక్ టార్గెట్ కావడంతో ఆత్మహత్యాయత్నం చేసిందని పార్ల‌మెంట్‌లో మ‌హిళా ఎంపీ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

చట్టాలు మార్చాల్సిన అవసరం
ప్రస్తుత చట్టాలు సరిపోవని, అనుమతి లేకుండా డీప్‌ఫేక్ ఫోటోలు లేదా వీడియోలు సృష్టించడం, పంచుకోవడం నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు మెక్ క్లూర్. ఈ టెక్నాలజీ దుర్వినియోగం ముఖ్యంగా మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. డీప్‌ఫేక్‌లు కేవలం న్యూజిలాండ్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళలు బలయ్యే సమస్యగా మారాయని ఆమె చెప్పారు. లా అసోసియేషన్ నివేదిక ప్రకారం, డీప్‌ఫేక్‌లలో 90-95 శాతం బలవంతంగా తయారవుతున్నవేన‌ని, బాధితులు ఎక్కువగా మహిళలేనని గుర్తించారు.

లారా మెక్ క్లూర్ వినూత్న ఆందోళన దేశవ్యాప్తంగా కాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డీప్‌ఫేక్ టెక్నాలజీని నియంత్రించేందుకు చట్టాలు అవసరం. మహిళల గౌరవాన్ని కాపాడటానికి, డిజిటల్ హక్కులను పరిరక్షించేందుకు ఇటువంటి చర్యలు ఎంతో కీలకమని ఆమె స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment