కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఆమిన్‌పూర్ (Ameenpur) లో జరిగిన ఓ అమానుష ఘటన మనసును కలచివేస్తోంది. రజిత (Rajitha) (45) అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు (Three Childrens) విషమిచ్చి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధం కోసం భర్తను, పిల్లలను చంపి ప్రియుడితో జీవించాలని ఆమె చేసిన కుట్ర భయానక నిజాలను వెలుగులోకి తెచ్చింది.
అంతేకాదు, ఈ ఘోరానికి తెరలేపిన పరిచయం ఇటీవల ఓ గెట్-టు-గెదర్ పార్టీ (Get-Together Party)లో మొదలైంది. అక్కడ ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. కుటుంబాన్ని వదిలేసి ప్రియుడితో జీవించాలని రజిత అనుకుంది. ఈ క్రమంలో భర్త చెన్నయ్య, పిల్లలను చంపేయాలనే దారుణ ఆలోచనకు వెళ్లింది.
విషపు కుట్ర – ముగ్గురు పిల్లల మృత్యువు
గత నెల 27న రాత్రి భోజన సమయంలో, రజిత పెరుగు (Curd) లో విషపదార్థం (Poisonous Substance) కలిపింది. కానీ భర్త చెన్నయ్య (Chennayya) ఆ రోజు పెరుగు తినకుండా డ్యూటీకెళ్లిపోవడంతో, ముగ్గురు పిల్లలు – సాయికృష్ణ (Saikrishna) (12), మధుప్రియ (Madhupriya) (10), గౌతమ్ (Gautham) (8) మాత్రమే తిని విగతజీవులయ్యారు. తన ఆరోగ్యం బాగాలేదంటూ నాటకం ఆడిన రజితను చెన్నయ్య ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే విచారణలో అసలు నిజం బయటపడింది. మొదట పోలీసులు చెన్నయ్యపైనే అనుమానం పెట్టుకున్నా, తరువాత రజిత చేసిన హేయకృత్యం వెలుగులోకి వచ్చింది.
కుటుంబ విలువలు, నైతికతపై ప్రశ్నలు
ఈ ఘటన సమాజంలో కుటుంబ బంధాలు ఎలా మారిపోతున్నాయనే దానికి స్పష్టమైన ఉదాహరణ. వ్యక్తిగత కోరికలు, ఆర్థిక ప్రయోజనాల కోసం కొంత మంది విలువలను త్యజిస్తున్నారు. ఒక తల్లి తన పిల్లల్ని హత్య చేయడం అమానుషం. నేడు పోలీసులు ఈ కేసుపై ప్రెస్‌మీట్ నిర్వహించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముంది.