11కే పరిమితమైన కూటమి.. సోష‌ల్ మీడియాలో సెటైర్లు

YS Jagan HD Images . Shock to the Kutami government in the local body elections.. Setters on number 11 on social media

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూట‌మి కేవలం 11 సీట్లకే పరిమితం కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. సాధారణ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి భారీ విజయం సాధించినా, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో (Local Body By-Elections) మాత్రం వైసీపీ (YCP) ని ఎదుర్కోలేక‌పోయింది. అధికార పార్టీ బెదిరింపులు, ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా వైసీపీ అభ్య‌ర్థులు బ‌లంగా నిల‌బ‌డ్డార‌ని, దీంతో కూట‌మికి ఎదురుదెబ్బ త‌ప్ప‌లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. స్థానిక ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వైసీపీ దూకుడు – టీడీపీ వెనుకంజ
ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం (Grand Victory) సాధించగా, టీడీపీ మాత్రం వెనకబడింది. బ‌లం లేక‌పోయినా ఎలాగోలా ఎంపీపీ (MPPs) , వైస్ ఎంపీపీ (Vice MPPs) ప‌ద‌వుల‌ను త‌న‌ఖాతాల్లో వేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ కూట‌మికి ఎదురుదెబ్బ త‌ప్ప‌లేదు. కొన్ని చోట్ల కోరం లేక‌పోవ‌డంతో ఎన్నిక‌ను అధికారులు వాయిదా వేశారు. న‌ర‌స‌రావుపేట‌ (Narasaraopet), ప్రొద్దుటూరు (Proddutur) వంటి ప్రాంతాల్లో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటుచేసుకున్న‌ప్ప‌టికీ.. మిగిలిన ప్రాంతాల్లో ఉప ఎన్నికలు ప్ర‌శాంతంగానే సాగాయి.

సోష‌ల్ మీడియాలో సెటైర్లు
గురువారం (Thursday) జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌లు 53 చోట్ల ఉప ఎన్నిక జ‌ర‌గ‌గా, వైసీపీ (YCP) 32, టీడీపీ+జ‌న‌సేన (TDP+Janasena) 11 చోట్ల విజ‌యం సాధించ‌గా, 10 స్థానాలు వాయిదా (Postponed) ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. దీంతో కూట‌మి పార్టీల‌న్నీ వైసీపీని టార్గెట్ చేశాయి. కూట‌మి పార్టీల నేత‌లంతా 11 సంఖ్య‌ను విప‌రీతంగా ట్రోల్ చేశారు. కొంద‌రు సినీ ప్ర‌ముఖులు కూడా 11పై వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. టీడీపీ, జ‌న‌సేన స‌భ్యులు అసెంబ్లీలో 11 అంటూ వైసీపీని అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. 11 నెల‌లుగా 11 నామ‌స్మ‌ర‌ణ చేస్తున్న కూట‌మికి స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో 11కే ప‌రిమిత‌మైంద‌ని వైసీపీ శ్రేణులు సోష‌ల్ మీడియా (Social Media)లో సెటైర్లు వేస్తున్నారు. అధికార పార్టీకి వైసీపీ లోక‌ల్ లీడ‌ర్స్ (YCP Local Leaders) బ‌లంగా నిల‌బ‌డి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పార‌ని, వైసీపీ క్యాడ‌ర్ (YCP Cadre) బ‌ల‌మేంటో తెలిసిందా అంటూ కూట‌మిని ప్ర‌శ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా లోక‌ల్ బాడీ ఉప ఎన్నిక‌ల్లోని ఫ‌లితాలు ప్ర‌తిప‌క్ష వైసీపీ క్యాడ‌ర్‌కు కొంత ఉత్తేజాన్ని నింపాయ‌ని చెప్పుకోక త‌ప్ప‌దు.

Join WhatsApp

Join Now

Leave a Comment