సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు విషాదకరంగా మారాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా 13 మంది ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందగా, మరో యువకుడు వడ్డే కర్ణాకర్ (25) పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కర్ణాకర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
శివాజీ జయంతి వేడుకల్లో ఇటువంటి ప్రమాదం జరగడం పట్ల గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా విద్యుత్ భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని స్థానికులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.