శివాజీ వ్యాఖ్యల వివాదం.. శివాజీపై సుమోటో కేసు

శివాజీ వ్యాఖ్యల వివాదం.. శివాజీపై సుమోటో కేసు

నటుడు శివాజీ (Actor Shivaji) ‘దండోరా’ (Dandora) సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన శివాజీ తాజాగా వీడియో విడుదల చేసి క్షమాపణలు (Apology) చెప్పారు. తన మాటల్లో రెండు అన్‌పార్లమెంటరీ పదాలు దొర్లాయని అంగీకరిస్తూ, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా Sincere Apologies అంటూ తెలిపారు. మహిళలను అవమానపరచాలనే ఉద్దేశం తనకు లేదని, మంచి చెప్పాలనే ప్రయత్నంలో తప్పు జరిగిందని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (Telangana State Women’s Commission) సుమోటో (Suo-Motu)గా స్పందించి కేసు నమోదు చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ చట్టం–1998లోని సెక్షన్ 16(1)(b) ప్రకారం విచారణ ప్రారంభించింది. ఈ మేరకు శివాజీకి నోటీసులు జారీ చేసి, డిసెంబర్ 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బుద్ధ భవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment