నోటి దూల వ్యాఖ్యలకు ‘సారీ’ చెప్పిన శివాజీ

సారీ చెప్పిన నోటి దూల శివాజీ

నటుడు శివాజీ (Actor Shivaji) ‘దండోరా’ (Dandora) సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు అంతా ఏకమై, శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. క్షవరం అయ్యాక వివరం బోధపడిందన్నట్లుగా శివాజీ దిగివచ్చాడు.

దీనిపై స్పందించిన శివాజీ తాజాగా ఒక వీడియో విడుదల చేసి క్షమాపణలు (Apology) చెప్పారు. తన మాటల్లో రెండు అన్‌పార్లమెంటరీ భూతులు (Unparliamentary Words) దొర్లాయని అంగీకరిస్తూ, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమాపణలు తెలిపారు. మహిళలను అవమానపరచాలనే ఉద్దేశం తనకు లేదని, మంచి చెప్పాలనే ప్రయత్నంలో తప్పు జరిగిందని స్పష్టం చేశారు. మొత్తంగా శివాజీ కామెంట్స్ ‘దండోరా’ సినిమా పై ప్రభావం పడుతుంది సిని వర్గాలు, నెటిజన్స్ చర్చించుకున్నట్లు సమాచారం.

ఈ వ్యాఖ్యలపై యాంకర్-నటి అనసూయ భారద్వాజ్ (Anasuya Bharadwaj) తీవ్రంగా స్పందించారు. మహిళల దుస్తులు వారి వ్యక్తిగత ఎంపిక అని చెబుతూ, “మా శరీరం మా ఇష్టం, దానిపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదు” అనే స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేర్ పేరుతో జరిగే ఈ తరహా వ్యాఖ్యలు మొరల్ పోలీసింగ్‌లా మారుతున్నాయని ఆమె విమర్శించారు.

ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (Telangana State Women’s Commission) సుమోటో (Suo Motu)గా స్పందించి కేసు నమోదు చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ చట్టం–1998లోని సెక్షన్ 16(1)(b) ప్రకారం విచారణ ప్రారంభించింది. ఈ మేరకు శివాజీకి నోటీసులు జారీ చేసి, డిసెంబర్ 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని బుద్ధ భవన్ మహిళా కమిషన్ కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment