అమరన్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన శివ కార్తికేయన్ తన కొత్త సినిమా పనులు ప్రారంభించారు. ‘ఎస్కే 25’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు విజేత సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో జయం రవి, అథర్వ వంటి ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఘనంగా పూజా కార్యక్రమాలు..
శివ కార్తికేయన్ నూతన చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగాయి. ఇందులో శివ కార్తికేయన్ ఒక విప్లవాత్మక ఆలోచనలున్న కళాశాల విద్యార్థిగా కనిపించబోతున్నారని సమాచారం. కథలో ఆయన పాత్రకు బలమైన సామాజిక సందేశం ఉంటుందట. ఈ చిత్రంపై కోలీవుడ్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.