హోటల్ (Hotel)లో డ్రగ్స్ రైడ్స్ (Drugs Raids)కు ముందు నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తప్పించుకొని వెళ్లిపోయారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కొచ్చి (Kochi) లోని ఓ ప్రముఖ హోటల్‌లో నార్కోటెక్ (Narcotics) అధికారుల బృందం వస్తుందన్న సమాచారం మేరకు హోటల్‌లోని థర్డ్ ఫ్లోర్‌లోని తన గది కిటికీ (Window) నుంచి కిందకు దూకి (Jumped Down) మెట్ల మార్గం ద్వారా చాకో తప్పించుకున్నారని నేషనల్ మీడియా వార్తలు ప్రచురించింది. దీంతో పోలీసుల నుంచి నటుడు చాకో తప్పించుకొని పారిపోయాడన్న వార్త మలయాళ ఇండస్ట్రీలో పెనుదుమారం రేపుతోంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల షూటింగ్ సమయంలో నటి విన్సీ అలోషియస్ (Vincy Aloshious) పట్ల షైన్ టామ్ చాకో అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఆ సమయంలో అతను డ్రగ్స్ తీసుకొని ఉన్నాడని, సెట్స్‌లో తనను ఇబ్బంది పెట్టాడని నటి ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై మలయాళ సినీ రంగ సంస్ధ AMMA ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, షైన్ టామ్ 2015లో కోకైన్ (Cocaine) కేసులో అరెస్టై (Arrested) అనంతరం నిర్దోషిగా విడుదలయ్యాడు. మళ్లీ డ్రగ్స్ ఆరోపణలతో వార్తల్లోకి వచ్చిన అతనిపై మరింత దర్యాప్తు జరిపే అవకాశం ఉందని సమాచారం.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య