తనపై వస్తున్న వదంతులపై ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. ఢీ డ్యాన్స్ షో విన్నర్, ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ జాను లిరితో సంబంధాలున్నాయని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ తనను తీవ్రంగా బాధించాయని ఆయన వెల్లడించారు.
“జాను లిరిని నేను ఓ డ్యాన్స్ షోలో మాత్రమే కలిశాను. ఆ తర్వాత ఆమె గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. కానీ, మా మధ్య సంబంధాలున్నట్టు వదంతులు ప్రచారం కావడం బాధాకరం. ఇలాంటి పుకార్ల వల్ల వ్యక్తిగతంగా చాలా గాయపడుతున్నాను. ఇకనైనా ఈ రూమర్స్ ఆపేయాలి” అని శేఖర్ మాస్టర్ కోరారు. ఈ వ్యాఖ్యలతో శేఖర్ తన వైపు నుండి క్లారిటీ ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ ఇంకా కొనసాగుతోంది.
మరో అంశంపై కూడా శేఖర్ మాస్టర్ స్పందించారు. తోటి కొరియోగ్రఫర్‌తో విభేదాలున్నాయన్న ప్రచారం జరుగుతోందని, అలాంటివేమీ నమ్మవద్దని సూచించారు. తామంతా బాగానే ఉంటామని, కలిసి మాట్లాడుకుంటామని చెప్పారు. దయచేసి సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని కోరారు.