అలనాటి మలయాళ నటి షీలా సెలిన్ సినీచరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్నారు. కథానాయికగా మాత్రమే కాకుండా, రచయిత, దర్శకురాలిగా కూడా ఆమె ప్రతిభను చాటారు. షీలా సెలిన్ తన సహనటుడైన మలయాళ సూపర్‌స్టార్ ప్రేమ్ నజీర్‌తో కలిసి 130 సినిమాల్లో నటించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించారు. ఒకే కథానాయిక, ఒకే కథానాయకుడితో అత్యధిక సినిమాలు నటించిన రికార్డుతో గుర్తింపు పొందింది.
500 పైగా చిత్రాలు, అత్యధిక పారితోషికం..
దక్షిణ భారతదేశంలో 500కి పైగా చిత్రాల్లో నటించిన షీలా, తన కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గానే కాక, ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఒక సినిమాలో కథను రాయడంతో పాటు, దానికి దర్శకత్వం వహించిన దక్షిణాది ఏకైక కథానాయికగా మరో అరుదైన ఘనతను కూడా సాధించారు.