శర్వానంద్ ‘బైకర్స‌.. రేసర్‌గా కొత్త లుక్!

శర్వానంద్ 'బైకర్స‌.. రగ్గడ్ రేసర్‌గా కొత్త లుక్!

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) హీరోగా, కొత్త దర్శకుడు అభిలాష్ కంకర (Abhilash) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బైకర్’ (Biker) (శర్వా 36). యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా, యాక్షన్, ఎమోషనల్ ఫ్యామిలీ అంశాల కలయిక. ఈ భారీ చిత్రం డిసెంబర్ 6, 2025 న విడుదల కానుంది.

ఈ చిత్రం కోసం శర్వానంద్ పూర్తిగా రూపాంతరం చెంది, మోటార్‌సైకిల్ రేసర్‌గా రగ్గడ్ బైకర్ అవతార్‌లో కనిపించనున్నారు. 1990లు, 2000ల కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథ, రేసింగ్ కలలు, కుటుంబ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటిస్తుండగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ మంచి అంచనాలను పెంచాయి. మట్టిలో జరిగే డర్ట్ బైకింగ్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. “గెలవడమే ముఖ్యం కాదు, చివరి దాకా పోరాడటమే గొప్ప” అనే సందేశాన్నిచ్చే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే, ఈ విడుదల తేదీన బాలకృష్ణ ‘అఖండ 2’ తో ‘బైకర్’ పోటీ పడే అవకాశం ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment