ఇండియా-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో హైదరాబాద్ (Hyderabad)లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి (International Airport) బాంబు (Bomb) బెదిరింపులు (Threats) కలకలం సృష్టించాయి. శంషాబాద్ రాజీవ్ గాంధీ (Shamshabad Rajiv Gandhi) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబుతో పేల్చేస్తామని వచ్చిన బెదిరింపు మెయిల్ (Mail) ఒకసారిగా అధికారులను అలర్ట్ చేసింది. “ఏ క్షణమైనా బాంబు పేలుస్తాం. ప్రభుత్వానికి వెంటనే సమాచారం ఇవ్వండి” అంటూ మెయిల్‌లో హెచ్చరికలతో పాటు పాక్ స్లీపర్ సెల్స్ పేరు (Pakistan Sleeper Cells Name)ను ప్రస్తావించడం సంచలనంగా మారింది.
బాంబు బెయిల్‌తో ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధికారులు విమానాశ్రయంలోని అణువణువూ తనిఖీ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్యాగేజీ కౌంటర్, లగేజీ కౌంటర్, లగేజీ ఏరియాస్, పార్కింగ్ జోన్లు సహా ప్రతి మూలను పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు కూడా కీలక సూచనలు జారీ చేశారు. ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఏదైనా వస్తువు, లగేజీ అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఎనౌన్స్‌మెంట్ ఇస్తున్నారు.
ప్రస్తుతం ఈ బెదిరింపుపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించాయి. లేక భయపెట్టాలనే కుట్రా అనే కోణాల్లో విచారణ సాగుతోంది. మెయిల్‌లో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరు ప్రస్తావించడం సంచలనంగా మారింది.