రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ని కీలక పదవి వరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి మినీశా సక్సెనా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు 2025 ఫిబ్రవరి 22 నుంచే అమలులోకి వస్తాయని ఆమె తెలిపారు.
శక్తికాంత దాస్ దేశ ఆర్థిక వ్యవస్థపై విస్తృత అనుభవం కలిగిన ప్రముఖ అధికారి. ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక విధానాలపై దృఢమైన ప్రభావం చూపాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టడం విశేషం. ప్రధాని మోడీ పదవీకాలంతో సమానంగా లేదా తరువాతి ఉత్తర్వులు జారీ చేసేవరకు శక్తికాంత్ దాస్ పదవిలో కొనసాగనున్నారు.