భారత్‌పై షాహిద్ ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్

భారత్‌పై షాహిద్ ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్

క‌శ్మీర్‌ (Kashmir) లోని పహల్గామ్‌ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) సంచలన వ్యాఖ్యలు చేశాడు. “భారత్ (India) తన దేశ పౌరుల‌ను తానే చంపుకుంటోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా పాకిస్తాన్‌ (Pakistan) పై ఆరోపణలు (Allegations) చేస్తోంది” అంటూ ఆరోపించాడు. దేశాల మధ్య విభేదాలను నివారించేందుకు చర్చల ద్వారా పరిష్కారం చూపాలని సూచించాడు.

“నిందలు వేయడం కాదు, ఒకే టేబుల్ మీద కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలి. క్రికెట్‌ (Cricket) ను రాజకీయలతో ముడిపెట్టకూడదు” అని ఆఫ్రిది అన్నాడు. ఆఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే భారత క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌పై భార‌త పౌరులు పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మృతుల‌కు సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీలు చేప‌డుతున్నారు. స‌రిహ‌ద్దులోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓపీ) వ‌ద్ద పాక్ క‌వ్వింపు చ‌ర్య‌లకు పాల్ప‌డ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment