షారుక్ ఖాన్, ఆయన కూతురు సుహానా ఖాన్ ప్రస్తుతం వరుస లీగల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. షారుక్ తన కొత్త సినిమా ‘కింగ్’ షూటింగ్లో బిజీగా ఉండగా, ఆ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, అదే సమయంలో వారిద్దరి పేర్లు చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్నాయి.
సుహానా ఖాన్ భూ వివాదం
సుహానా ఖాన్ మహారాష్ట్రలోని థాల్ గ్రామంలో 12.91 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అయితే, రైతు హోదా లేనివారు వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమని అధికారులు పేర్కొంటున్నారు. ఆమె రైతు హోదా కోసం 77 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించినప్పటికీ, ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది.
షారుక్ ఖాన్ ఇంటి వివాదం
మరోవైపు, షారుక్ ఖాన్ నివాస నిర్మాణ పనుల విషయంలోనూ సమస్యలు తలెత్తాయి. ముంబై మెట్రోపాలిటన్ కార్పొరేషన్ అధికారులు ఆయన ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డును ఆక్రమించారని ఆరోపించారు. ఈ విషయమై వారికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో అధికారులు మళ్లీ నోటీసులు పంపారు.