కారులో ఏడుగురు మృతదేహాలు.. హర్యానాలో విషాదం!

కారులో ఏడుగురు మృతదేహాలు.. హర్యానాలో విషాదం!

హర్యానా (Haryana) పంచకులలో ఒకే కారు (Car)లో ఏడుగురు (Seven) మృతదేహాలు (Dead Bodies) గుర్తింపు కావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటన స్థానికులను, అధికారులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులు డెహ్రాడూన్ (Dehradun)కు చెందిన ప్రముఖ వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ (Praveen Mittal) కుటుంబానికి చెందినవారు. మృతుల్లో ప్రవీణ్ మిట్టల్ (42)తో పాటు ఆయన తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. వారు సోమవారం బాగేశ్వర్ ధామ్ (Bageshwar Dham)లో జరిగిన హనుమాన్ కథ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పంచకులకు వచ్చినట్లు సమాచారం. కార్యక్రమం ముగిశాక వారు డెహ్రాడూన్‌కి తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఇది సామూహిక ఆత్మహత్య (Mass Suicide)గా భావిస్తున్నారు. కుటుంబం భారీ ఆర్థిక సమస్యలతో (financial distress) బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఒత్తిడితోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు మనుషులను ఎంత తీవ్రమైన నిర్ణయాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి తెలియజేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment