ఏపీపై ‘సెనియార్’ తుఫాన్ ముప్పు.. క‌డ‌ప‌లో భారీ వ‌ర్షం

ఏపీపై 'సెనియార్' తుఫాన్ ముప్పు.. క‌డ‌ప‌లో భారీ వ‌ర్షం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని మ‌రో తుపాన్ ముప్పు వెంటాడుతోంది. బంగాళాఖాతం (Bay of Bengalలో ఏర్ప‌డిన‌ అల్పపీడనం (Low Pressure Area) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, 24వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా, 26, 27 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావ‌ర‌ణ శాఖ‌ పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత దీనికి సెనియార్‌ (Seniar) అని పేరు పెట్టనున్నారు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌–యూఏఈ (United Arab Emirates – UAE) ఈ పేరు సూచించింది. సెనియార్ తుఫాన్ ప్ర‌భావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇప్పటికే అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ప‌డింది. కడప జిల్లా (Kadapa District)లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల వర్షం కారణంగా రహదారులు జలమయం కాగా, కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అధికారులు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

కడప కో-ఆపరేటివ్ కాలనీలో వర్షానికి భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ చెట్టు ట్రాన్స్ఫార్మర్‌పై పడటంతో విద్యుత్ తీగలు తెగిపోయి, ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటనపై స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించి, త్వరలోనే సరఫరా పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment