తెలంగాణ హైకోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వేణుగోపాలరావు అకస్మాత్తుగా కుప్పకూలారు. ఈ ఘటన తోటి న్యాయవాదులను షాక్‌కు గురి చేసింది. దీంతో అదే కోర్టు హాల్లో ఉన్న న్యాయవాదులు వెంటనే స్పందించి, అతన్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే గుండెపోటుతో ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
పిటిషన్ల విచారణకు బ్రేక్
వేణుగోపాలరావు మృతికి సంతాప సూచకంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను మాత్రమే విచారించి, రెగ్యులర్ కేసులను వాయిదా వేశారు.








