విశాఖలో మూగ బాలికపై అత్యాచారం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

విశాఖలో మూగ బాలికపై అత్యాచారం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

విశాఖపట్నం (Visakhapatnam)లో హృదయ విదారక సంఘటన వెలుగుచూసింది. ద్వారక(Dwaraka) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో మద్యం మత్తులో ఇద్దరు కీచకులు మూగ బాలిక (Dumb Girl)పై అత్యాచారానికి ఒడిగట్టారు. 11 ఏళ్ల బాలికను ఎస్.ఆర్.నగర్(S.R Nagar) ప్రాంతంలోని పొదల్లోకి తీసుకువెళ్లి దారుణంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి తల్లిదండ్రులు 112 ద్వారా కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మద్యం మత్తులో ఉన్న నిందితులు బాలిక వేడుకున్నా, “తనపై దాడి చేయొద్దు” అని దీనంగా సైగ‌ల‌తో బ్రతిమిలాడినా వినిపించుకోకుండా, కిరాతకానికి పాల్పడ్డారు. బాలిక పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉందని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం.

బాలిక ఇచ్చిన వివరాల ఆధారంగా గాలింపు నిర్వహించి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన విశాఖలో కలకలం రేపగా, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment