‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీరిలీజ్‌.. ఎప్పుడంటే..

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీరిలీజ్‌.. ఎప్పుడంటే..

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) మరియు విక్టరీ వెంకటేష్(Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (SVSC Re-release) మరోసారి థియేటర్లలో సందడి చేయనుందా? ఈ సినిమా విడుదలై ఇప్పటికే 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర‌యూనిట్ రీ-రిలీజ్ చేసే ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం.

ఇంతలో హీరోయిన్ అంజలి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “ఈ సినిమాను ఫిబ్రవరిలో తిరిగి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు(Dil Raju)ను కోరాను” అని చెప్పడం రీరిలీజ్‌పై మరింత ఆసక్తిని పెంచింది. అయితే, అధికారిక రీ-రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.

ఈమూవీ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేశ్-వెంకటేష్ మధ్య కెమిస్ట్రీ, కుటుంబ విలువలు, సంగీతం—ఇవి సినిమాను ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచేలా చేశాయి. మరి, రీ-రిలీజ్ డేట్ త్వరలో అధికారికంగా అనౌన్స్ అవుతుందా? వేచి చూడాలి!

Join WhatsApp

Join Now

Leave a Comment